Tuesday, November 26, 2024

AP : పులివెందుల‌లో సీఎం జ‌గ‌న్‌… రూ. 862 కోట్ల అభివృద్ధి ప‌నుల‌ ప్రారంభోత్స‌వాలు

కడప బ్యూరో, ప్రభ న్యూస్: క‌డ‌ప జిల్లాలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా గన్నవరం విమానాశ్రయం నుండి కడప విమానాశ్రయం చేరుకున్న ఆయనకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైకాపా నేతలు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక చాపర్​లో పులివెందులకు చేరుకొని రూ. 862 కోట్లతో పులివెందుల, ఇడుపులపాయలో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

- Advertisement -

కాగా, కడప విమానాశ్రయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. బి. అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు, నగర మేయర్ కె. సురేష్ బాబు, ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ మళ్ళికార్జున రెడ్డి, ఎమ్మెల్సీలు పి. రామ సుబ్బారెడ్డి, ఎం. రామచంద్రా రెడ్డి, డి.సి. గోవిందరెడ్డి, రమేష్ యాదవ్, ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డి, దాసరి సుధ, మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, సుధీర్ రెడ్డి ఇతర నాయకులు అధికారులు, తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆప్యాయంగా అందరిని పేరుపేరున పలకరించి పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు.

పులివెందులలో బాకరపురం హెలిప్యాడ్ నుండి రోడ్డు మార్గం ద్వారా డా.వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ప్రాంగణం చేరుకుని.. వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం డా.వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ప్రాంగణం చేరుకుని.. వైఎస్ఆర్ మెడికల్ కళాశాల, జిజిహెచ్ భవనాలకు ప్రారంభోత్సవం చేసి.. ఓపిడి, ఐపిడి బ్లాకులను పరిశీలించారు. అనంతరం రైతుల కోసం నిర్మించిన అరటి ఇంటి గ్రేటెడ్ ప్యాక్ హౌస్, మినీ సెక్రటేరియట్, సెంట్రల్ బోలి వార్డు, వైఎస్ఆర్ విగ్రహం, గాంధీ విగ్రహం, ఉల్లిమెల్ల  లేక్, ఆదిత్య బిర్లా గార్మెంట్ లను ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement