రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు. సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సోమవారం సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వాటిని ఆర్బీకే(రైతు భరోసా కేంద్రం)ల ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలన్నారు. నేచురల్ వ్యవసాయం కోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులివ్వాలని సీఎం జగన్ సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement