దివంగతనేత..మాజీ సీఎం..తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు సీఎం జగన్.కాగా జగన్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి పులివెందుల వెళ్లి జగన్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. విజయ హోమ్స్ దగ్గర ఉన్న జంక్షన్‌ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి మరిన్ని అభివృద్ధి పనుల కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటారు. కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణ రోడ్డును, నూతన కూరగాయల మార్కెట్, మైత్రి లేఅవుట్‌లో వైఎస్సార్ స్మారక పార్కును ప్రారంభిస్తారు.
ఆ తర్వాత రాయలాపురం నూతన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. డాక్టర్ వైఎస్సార్ బస్ టర్మినల్‌ను ప్రారంభించి, బస్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ వెంటనే నాడు- నేడు ద్వారా అభివృద్ధి చేసిన అహోబిలాపురం పాఠశాలను ప్రారంభించి తిరిగి ఇడుపులపాయకు బయలుదేరి వెళతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆదివారం క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు.