Tuesday, November 26, 2024

అన్నమయ్య ప్రాజెక్టుకు రీ-డిజైన్‌: సీఎం జగన్ కీలక ఆదేశాలు

అన్నమయ్య ప్రాజెక్టును రీ డిజైన్‌ చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్‌ చేయాలి, కానీ 2.17 లక్షల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేసేలా అప్పుడు డిజైన్‌ చేశారని చెప్పారు. కాని దురదృష్టవశాత్తూ ఇప్పుడు 3.2 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని తెలిపారు. 2017లో అన్నమయ్య ప్రాజెక్టుపై నివేదిక కూడా ఇచ్చారు, ప్రాజెక్టును మెరుగుపరచమన్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం విధానాల కారణంగా ఇలాంటి పరిస్థితుతులు ఉన్నాయని సీఎం జగన్‌ ఆరోపించారు. ఇవాళ ప్రాజెక్టు విషయంలో విమర్శలు చేస్తున్న నాయకులు.. అప్పుడు పట్టించుకోలేదని మండిపడ్డారు. పింఛా విడుదల సామర్థ్యం 58వేల క్యూసెక్కులు అయితే, 1.38 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని పేర్కొన్నారు. దీనిపై ఉన్న అన్ని వాగులు, వంకలు కూడా ఎప్పుడూలేని విధంగా వరదనీరు వచ్చిందని… ప్రాజెక్టుల వద్ద, చెరువుల వద్ద నీటి విడుదల సామర్థ్యానికి మంచి వరద వచ్చిందని వెల్లడించారు. చెయ్యేరు వెంబడికూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందని… భవిష్యత్తులో ఇలాంటి వరద వస్తుందని అంచనా వేసుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రస్తుతం వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 13 జిల్లాల్లో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టుల భద్రతపై దృష్టిపెట్టండన్న సీఎం జగన్.. డ్యాంల భద్రతపై గత ప్రభుత్వాల్లో ఇచ్చిన నివేదికలు బయటకు తీయలన్నారు. ప్రస్తుతం ఉన్న నీటి విడుదల సామర్థ్యం, గరిష్ట వరద ప్రవాహంపై అంచనాలను మరోసారి పరిశీలించి, నివేదికలు తయారుచేయాలని సూచించారు. ఉదాసీనత వల్ల ఇప్పటివరకూ పెండింగులో ఉన్న డ్యాంల భధ్రతపై దృష్టిపెట్టాలన్నారు. అన్నమయ్య లాంటి ఘటనలు భవిష్యత్తులో జరక్కూడదని స్పష్టం చేశారు. దీనికోసం అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement