భీమవరం: మన రాష్ట్రంలో పిల్లలు గొప్పగా చదవాలని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్ల నిధులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ, ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని వ్యక్తి. మరొకరు ఆ వ్యక్తికి కొమ్ము కాసే వ్యక్తి. ఈ ఇద్దరు ఇప్పుడు ఏకమై ప్రజల్ని వంచించేందుకు సిద్ధం అయ్యారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కల్యాణ్‌లపై ధ్వజమెత్తారు.
జనసేన – టిడిపి లపై మాట్లాడుతూ పద్నాలుగేళ్లు ఏళ్లు పాలించిన వ్యక్తి చేసిన మంచి చెప్పి ఓట్లు అడగాలి. అమ్మ ఒడి కంటే మెరుగైన పథకం అమలు చేసి ఉంటే.. అది చెప్పి ఓట్లు అడగాలి. ఇప్పుడు అమలు చేస్తున్న వాటి కంటే మెరుగైన పథకాల్ని అమలు చేసి ఉంటే వాటి గురించి చెప్పి ఓట్లు అడగాలి. ఆయన పాలించిన 14 ఏళ్లు ఏం చేశారో చెప్పని వ్యక్తి.. పాదయాత్ర ముగింపు సభలో మాత్రం మాట్లాడాడు. కానీ, కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామమైనా చూసుకోండి. గ్రామ సచివాలయం పెట్టింది ఎవరంటే జగనే గుర్తొస్తాడు. వలంటీర్ వ్యవస్థతో ఒకటో తేదీన మీ ఇళ్లకే పెన్షన్ అందిస్తోంది మీ జగన్. గ్రామస్థాయిలోనే విలేజ్ క్లినిక్‌లు పెట్టింది మీ జగన్. పౌర సేవల్ని తెచ్చింది మీ జగన్. పొదుపు సంఘాలకు జీవం పోసిందెవరంటే గుర్తొచ్చేది మీ జగన్. అక్కాచెల్లెళ్లకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తోంది మీ జగన్. బాబు కంటే మూడు రెట్లు పఫించన్ పెంచింది ఎవరంటే గుర్తొచ్చేది మీ జగన్. ఇంతకన్నా మంచి చేసి ఉంటే అది చెప్పి ఓట్లు అడగాలి అంటూ పవన్ , చంద్రబాబుకు క్లాస్ పీకారు జగన్.
భార్యలను మార్చేవాళ్లకు ఓట్లు వేయవద్దు…
పక్క వ్యక్తిని ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ పెట్టేవారు ఎవరూ ఉండరు. రియల్ లైఫ్‌లో ఏ భార్యతో నాలుగేళ్లు కలిసి ఉండడు. మ్యారేజ్ స్టార్ ఆడవాళ్లను ఆటవస్తువులుగా చూస్తాడు. పెళ్లి అనే సంప్రదాయాన్ని మంట గలిపాడు. ఇప్పటికే ముగ్గురు భార్యాలను మార్చాడు. కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తాడు. ఇలాంటి వాళ్లను నాయకుల్ని చేస్తే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటి?. ఇలాంటి వాళ్లకు ఓటేయడం ధర్మమేనా?. అంటూ పవన్ పై ఒంటికాలిమీద లేచారు జగన్..
త్యాగరాజుకు , ప్యాకేజ్ స్టార్ కు నమ్మవద్దు ..
చంద్రబాబుకిగానీ, పవన్‌కల్యాణ్‌కి గానీ ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు. దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు. ప్యాకేజీ కోసం తన వర్గాన్ని త్యాగం చేసిన త్యాగాల త్యాగరాజు. భార్యతో మూడేళ్లు ఉండడు. కానీ, చంద్రబాబుతో 15 ఏళ్ల బంధం కావాలని అంటాడు. దత్తపుత్రుడికి ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే.. ఇవ్వకున్నా ఓకే. ప్రజల కోసం త్యాగాలు చేసేవారిని చూశాం కానీ ప్యాకేజీ కోసం త్యాగాలు చేసేవాళ్లను ఇప్పుడే చూస్తున్నాం. భీమవరం ఓడించిన దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఉంటున్నాడు అంటూ ఫైర్ అయ్యారు..
కిలో బంగారం.. ఇంటికో కారు..
అన్ని వర్గాలను వంచించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ హామీలు ఇస్తున్నాడు. ఇంటికి కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తానంటున్నాడు. ఇలాంటి వారిని చూసినప్పుడు వేమన పద్యం గుర్తుకు వస్తుంది. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు.. రెండు విషాలు(చంద్రబాబు, పవన్‌ను ఉద్దేశించి..) కలిస్తే అమృతం అవుతుందా? నలుగురు ఒక్కటవుతే కౌరవుల సంఖ్య పెరగుతుంది అంతే.. అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ప్రజలకు వాళ్లు చేసింది ఏమీ లేదు కాబట్టే మోసాల్ని వంచల్ని మత్రమే నమ్ముకున్నారు. అధికారం కోసం ఎన్ని మోసాలైనా చేస్తారు. అని సీఎం జగన్ అన్నారు.