రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరుపుతున్నారు. రెండోరోజు పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఇవాళ జగన్ భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతో పాటు కాకినాడ పెట్రో కాంప్లెక్స్, పెట్రో వర్సిటీ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తోనూ ఆయన సమావేశం కానున్నారు. రైల్వేకు సంబందించిన పలు అంశాలను ఆయనతో చర్చిస్తారు.
ఇక, నిన్న కేంద్రమంత్రులు అమిత్‌షా, గజేంద్రసింగ్ షెకావత్, ప్రకాశ్ జవదేకర్ తో సీఎం జగన్ సమావేశం అయ్యారు. పోలవరం సహా ఏపీకి సంబందించిన అనేక అంశాలపై వారితో చర్చించారు. కాగా, సీఎం తన పర్యటన ముగించుకుని ఈ రోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని తన అధికారిక నివాసానికి చేరుకునే అవకాశం ఉంది.