ఏపీ సీఎం వైఎస్ జగన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు రోజుల కడప జిల్లా పర్యటనను ముగించుకుని శనివారం మధ్యాహ్నం విజయవాడ చేరుకున్న సీఎం జగన్.. నోవాటెల్ లో సీజేఐ రమణతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
గతంలో జస్టిస్ రమణ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిల మధ్య విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. జస్టిస్ రమణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అప్పటి సీజేఐ జస్టిస్ బాబ్డేకు లేఖ రాశారు. అయితే, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూరి హోదాలో ప్రస్తుతం ఎన్వీ రమణ ఏపీలో పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను సీఎం కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధికార్యక్రమాల శంకుస్థాపన, పథకాల అమలు, ఇతర కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొన్న విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..