ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలో పవర్ ప్రాజెక్ట్ త్రీడీ మోడల్ నమూనాను ప్రారంభించారు. ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణ పల్లి-గుమ్మటం తాండా వద్ద ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ వద్ద పైలాన్ ను ఆవిష్కరించిన అనంతరం కాంక్రీటు వేసి ప్రాజెక్ట్ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును గ్రీన్ కో గ్రూప్ జిల్లాలో ఏర్పాటు చేస్తోంది. 10800 మెగా వాట్ పర్ హవర్ దినసరి నిల్వ సామర్థ్యం కలిగిన పంప్డ్ స్టోరేజీ, 5230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు. ఒకే యూనిట్ నుంచి సోలార్, పవన, జల విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టు కోసం 3 బిలియన్ యుఎస్ డాలర్లు పెట్టుబడి గ్రీన్ కో గ్రూప్ సంస్థ కేటాయిస్తోంది.
భారీ పవర్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
Advertisement
తాజా వార్తలు
Advertisement