Friday, November 22, 2024

Flash: పరిపాలన వికేంద్రీకరణే మా విధానం: కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్

పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సోమవారం ఉదయం క్యాంప్‌ కార్యాలయంలో కొత్త జిల్లాలను ప్రారంభించారు. అనంతరం జిల్లాల ఏర్పాటు ఆవశ్యకతను ఆయన స్వయంగా వివరించారు.  గతంలో ఉన్న జిల్లాలు యథాతధంగానే ఉంటాయని గుర్తు చేశారు. ఏపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలోనే 26 జిల్లాలు ఉన్నాయని.. జనాభా ప్రతిపాదికన చూసుకుంటే ఏపీకి జిల్లాల ఏర్పాటు అవసరం తప్పక ఉందని తెలిపారు. ప్రజల సెంటిమెంట్లను, గొప్పవాళ్లను పరిగణనలోకి తీసుకున్నాకే జిల్లాలను ఏర్పాటు చేశామని, వాటికి పేర్లు కూడా పెట్టినట్లు వెల్లడించారు. 

గ్రామస్థాయి నుంచి రాజధానుల వరకు పరిపాలన వికేంద్రీకరణే మా విధానం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణే సరైన విధానమన్నారు. వికేంద్రీకరణతోనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. కొత్త జిల్లాలతో మెరుగైన పాలనా, శాంతి భద్రతలు, పారదర్శకత ఉంటుందని తెలిపారు. గ్రామస్థాయి నుంచి పరిపాలనపై దృష్టి పెట్టిన తమ ప్రభుత్వం.. అందుకు తగ్గట్లే జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిందని సీఎం జగన్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement