ఉగాది పండగ ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ క్యాలెండర్ విడుదల చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు సీఎం జగన్ అనంతరం ప్రభుత్వ క్యాలెండర్ను విడుదల చేశారు. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు సీఎం.
నెలల వారీగా పథకాలు- కార్యక్రమాలు:ఏప్రిల్–2021 సంబంధించి జగనన్న వసతి దీవెన మొదటి విడత, జగనన్న విద్యా దీవెన, రైతులకు వైయస్సార్ సున్నా వడ్డీ, పొదుపు సంఘాల మహిళలకు వైయస్సార్ సున్నా వడ్డీ చెల్లింపులు, వైయస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య ఆసరా, వైయస్సార్ పెన్షన్ కానుక అమలు.
మే–2021: వైయస్సార్ ఉచిత పంటల బీమా, వైయస్సార్ రైతు భరోసా మొదటి విడత. మత్స్యకార భరోసా, మత్స్యకార భరోసా, రెగ్యులర్ పథకాలు అమలు
జూన్–2021: వైయస్సార్ చేయూత, జగనన్న విద్యా కానుకతో పాటు, రెగ్యులర్ పథకాలు.
జూలై–2021: జగనన్న విద్యా దీవెన రెండో విడత. వైయస్సార్ కాపు నేస్తం. వైయస్సార్ వాహనమిత్ర. ఇంకా రెగ్యులర్ పథకాలు.
ఆగస్టు–2021: రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు (2020-ఖరీఫ్), ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక రాయితీలు. వైయస్సార్ నేతన్న నేస్తం, అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు. ఇంకా రెగ్యులర్ పథకాలు.
సెప్టెంబరు–2021: వైయస్సార్ ఆసరాతో పాటు, రెగ్యులర్ పథకాలు.
అక్టోబరు–2021: వైయస్సార్ రైతు భరోసా రెండో విడత. జగనన్న చేదోడు, జగనన్న తోడు, రెగ్యులర్ పథకాలు.
నవంబరు–2021: వైయస్సార్ ఈబీసీ నేస్తంతో పాటు, రెగ్యులర్ పథకాలు.
డిసెంబరు–2021: జగనన్న వసతి దీవెన రెండో విడత. జగనన్న విద్యా దీవెన మూడో విడత. వైయస్సార్ లా నేస్తం. రెగ్యులర్ పథకాలు.
జనవరి–2022: వైయస్సార్ రైతు భరోసా మూడో విడత. జగనన్న అమ్మ ఒడి. పెన్షన్ పెంపు. ఇక నుంచి నెలకు రూ.2500. ఇంకా రెగ్యులర్ పథకాలు.
ఫిబ్రవరి–2022: జగనన్న విద్యా దీవెన నాలుగో విడత. రెగ్యులర్ పథకాలు