పాలు పోసే రైతులే అమూల్ సంస్థ ఓనర్స్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ రోజు ‘జగనన్న పాలవెల్లువ’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తొలి విడతలో కృష్ణా జిల్లా నూజివీడు క్లస్టర్ గా అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ అమలులోకి రానుందని తెలిపారు. పాలవెల్లువ ద్వారా రైతులకు మెరుగైన ధర అందించనున్నట్లు చెప్పారు. పాలు పోసే రైతులే అమూల్ సంస్థ ఓనర్స్ అని ప్రకటించారు. అమూల్‌కు పాలు పోయడం వల్ల రూ.10 కోట్ల ఆదాయం వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఐదు జిల్లాల్లో పాడి రైతులకు మెరుగైన ధర లభించిందని సీఎం తెలిపారు. 1064 గ్రామాల నుంచి పాలసేకరణ చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు.
ఇప్పటికే ఐదు జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రకాశం జిల్లాలో 245 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 275 గ్రామాలు, కడప జిల్లాలో 149 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 174, గుంటూరు జిల్లాలో 203 గ్రామాల నుంచి అమూల్ సంస్థ పాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 148.50 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగింది. పాడి రైతులకు దాదాపు రూ.71 కోట్లు చెల్లించారు. ఇతర డైరీలతో పోల్చితే అమూల్ పది కోట్లు అదనంగా ఇచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..