ఏపీలోని అవ్వాతాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్త ఏడాదిలో పింఛన్ దారులకు వైయస్ జగన్ సర్కార్ కానుక అందించింది. జనవరి 1, 2022 నుంచి పెన్షన్ రూ.2500కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెన్షన్‌ను రూ.2500కు పెంచి ఇవ్వనుంది ప్రభుత్వం. జనవరి 1, 2022న అవ్వాతాతలు చేతిలో రూ.2500 పెన్షన్ మొత్తాన్ని పెట్టనుంది.
కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ప్రస్తుతం ఇస్తున్న రూ. 2,225 పింఛన్ ను రూ. 2,500కు పెంచుతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని చెప్పారు.
ఈ నెల 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 9న ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈబీసీ నేస్తం పథకం వల్ల అగ్రవర్ణ నిరుపేద మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. 45 నుంచి 60 ఏళ్ల వయసున్న నిరుపేద మహిళలకు మూడేళ్లలో రూ. 45 వేల చొప్పున ఆర్థికసాయం చేయనున్నారు. జనవరిలో రైతు భరోసా సాయాన్ని కూడా అందజేస్తామని చెప్పారు.