ఏపీ సీఎం జగన్ తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్పందన’ పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్ ఆక్సిజన్ లభ్యత లేక 11 మంది చనిపోవడంపై వివరణ ఇస్తూ, కొవిడ్ కట్టడి, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ అందజేత వంటి అంశాలపై తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్పారు. ఒక్కోసారి ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా నష్టాలు జరుగుతున్నాయి. వాటికి కూడా మనమే బాధ్యత వహించకతప్పదు. తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాకపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వివరించారు. కొన్ని అంశాలు మన చేతుల్లో ఉండవు అని, అటువంటి సంఘటనలకు కూడా తామే బాధ్యత వహించాల్సి వస్తోందని అన్నారు.
ఒక్కోసారి ఎంత కష్టపడినా నష్టాలు జరుగుతున్నాయి: రుయా ఘటనపై సీఎం జగన్
Advertisement
తాజా వార్తలు
Advertisement