అవుకు/నంద్యాల : అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అవుకు మండలం మెట్టుపల్లె సమీపంలో అవుకు రెండో టన్నెల్ ను జాతికి అంకితం చేసి పైలాన్ ను ఆవిష్కరించి… రిజర్వాయర్ నుంచి అదనంగా 10,000 క్యూసెక్కులు వెరసి మొత్తం 20,000 క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 567 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన రెండో సొరంగం పనుల ఫోటో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జలవనరుల ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర రెడ్డి, మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హాబీబుల్లా, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్, జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, మార్క్ ఫెడ్ చైర్మన్ పి.పి.నాగిరెడ్డి, నంద్యాల జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విజయ మనోహరి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, తదితరులు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట వున్నారు.