Friday, November 22, 2024

CM JAGAN: బ‌కాయిలు చెల్లించండి… లేకుంటే 29నుంచి ఆరోగ్య శ్రీ సేవ‌లు బంద్..

అమ‌రావ‌తి – ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం వైఎస్ జగన్ సమ్మెలు, ఆందోళనలు, నిరసనల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు. ఆశావర్కర్లు, సర్వశిక్షాఅభియాన్ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు. వాలెంట‌ర్లు ఇలా ఒక్కొక్కరు ప్రభుత్వంపై ఆందోళ‌న బాట ప‌ట్టారు.

తాజాగా వైసీపీ ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ సేవల నెట్ వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు బిగ్ షాక్ ఇచ్చాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపు, శస్త్రచికిత్సల ఛార్జీల పెంపు డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో ఈనెల 29 నుంచి ఆరోగ్య శ్రీ క్రింద రోగులను చేర్చుకోబోమని హెచ్చరించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సేవల నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు వైసీపీ ప్రభుత్వానికి లేఖ రాశాయి. డిసెంబర్ 15 లోగా అని సమస్యలను పరిష్కరిస్తామంటూ ఆస్పత్రుల యాజమాన్యాలకు గతంలో ప్రభుత్వం హామీలు ఇచ్చి దాన్ని అమలు పరచలేదని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని భావించినట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రూ.1000కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పలు శస్త్ర చికిత్సలకు సంబంధించిన ఛార్జీలను పెంచాలని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement