ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తర్వాత సీఎం జగన్ రేణిుగంట ఎయిర్ పోర్ట్ నుంచి తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు కీలక సూచనలు చేశారు. ఎయిర్ పోర్ట్ లో ఎమ్మెల్యే భూమన, అధికారులు సీఎంకు వీడ్కోలు పలికారు.
కాగా, ఇప్పటికే మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు రెండు వేల రూపాయల చొప్పున సాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital