Friday, November 22, 2024

ఏపీలో సీఎం కప్ టోర్నీ.. 21న విశాఖలో క్రికెట్ మ్యాచ్ ప్రారంభం

విశాఖపట్నం, ప్రభన్యూస్‌: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా సంబరాలు నిర్వహించనుందని ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్‌ నిర్వహించేందుకు శాప్‌ సన్నాహాలు చేస్తోందని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్‌ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. ఈ నెల 20న శ్రీకాకుళం, 21న విశాఖపట్నంలో టోర్నీ ప్రారంభమవుతుందన్నారు. మొత్తం 15 వివిధ రకాలైన క్రీడల పోటీలు నిర్వహిస్తున్న సీఎం కప్‌ టోర్నీలో ఈసారి క్రికెట్‌ ను కూడా జోడించడం జరిగిందన్నారు. క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు.

కొవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పడుతున్న తరుణంలో విదేశాల నుంచి దేశానికి వచ్చే పర్యాటకులపై ఆంక్షలు సడలింపు నిర్ణయం హర్షణీయమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో టూరిజం, హాస్పిటాలిటీ రంగాలు పుంజుకుంటాయని, తద్వారా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు.

కొవిడ్‌ పై పోరాటంలో దేశం చూపిన నిబద్దత, అంకిత భావం తనను ఎంతగానో అకట్టుకున్నాయని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మాల్‌ పాస్‌ అన్నారు. దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఉత్పత్తి, పంపిణీ, ప్రచారం మెదలగు అంశాలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ కు అభినందింనలు తెలిపారు. యుఎస్‌ఏ, యుకె, కెనడా ఇతర దేశాలలో ఉన్నత చదువులు చదువుకుంటున్న దేశానికి చెందిన విద్యార్థులు తమ మాతృ దేశానికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, నిర్దేశిత ఫ్లైట్ లపై ఆంక్షల కారణంగా 3 రెట్లు అధిక ప్రయాణ చార్జీలు చెల్లిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయా ప్రాంతాల నుండి విమాన సర్వీసులు పెంచాలని కోరారు.

ఇది కూడా చదవండి.. విప్లవ పయనమెటు? తగ్గిపోతున్న మావోయిస్టు కేడర్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement