Thursday, September 19, 2024

AP | వరద నష్టం అంచనాలపై చంద్రబాబు సమీక్ష ..

ఏపీలో వరద నష్టం అంచనాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ క్ర‌మంలో వరద నష్టం అంచనా ఎంత మేరకు ఉందని సీఎం ఆరా తీశారు. అయితే, వరద నష్టం అంచనాకు సంబంధించిన సమగ్ర వివరాలను అధికారులు అందించలేకపోయారు. దీంతో అధికారుల‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరద నష్టాన్ని అంచనా వేయడంలో ఇంత జాప్యం చేస్తే ఎప్పటికైనా నష్టపరిహారం ఇవ్వగలమని సీఎం చంద్రబాబు అధికారులను మందలించారు. వరద నష్టం అంచనాలు పూర్తయిన తర్వాతే కేంద్రానికి వరద నష్టం వివరాలను అందజేస్తామని అధికారులు దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని సీఎం సూచించారు. వరద నష్టం అంచనాను రేపటిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

కాగా, రాష్ట్రంలో వరద నష్టం అంచనాల కోసం క్షేత్ర స్థాయిలో పర్యటించిన కేంద్ర బృందం ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాబుతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా భారీ వర్షాల వల్ల వరదల వల్ల అనూహ్య నష్టం జరిగిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని సీఎం కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement