Saturday, January 11, 2025

AP | ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..

ప‌లు పెండింగ్ బిల్లులు, బకాయిలకు నిధుల కేటాయింపు

సంక్రాంతికి సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వివిధ వ‌ర్గాల‌కు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, బకాయిల చెల్లింపునకు ఆమోదం తెలిపారు. ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై చర్చించారు.

విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసు శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవ్వడంపై సీఎం ప్రధానంగా చర్చించారు. ఈ క్రమంలో పలు పెండింగ్ బిల్లులు, బకాయిల చెల్లింపునకు రూ.6,700 కోట్లు విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.

- Advertisement -

ప్రజల సంతోషం కోసం ప్రతిక్షణం పనిచేస్తాం

రాష్ట్రంలోని వివిధ వర్గాలకు మేలు జరిగేలా నేడు ఆర్ధికపరమైన నిర్ణయం తీసుకోవడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా అన్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ.. వారికి మేలు చేసేందుకే ఈ ప్రయత్నమని అన్నారు.

నిధుల విడుదలపై నేడు తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది ఇండ్లల్లో ఆనందాన్ని నింపుతుందని అన్నారు.ప్రతి వర్గానికి మేలు చేసేలా నిరంతరం శ్రమిస్తామని… ప్రజల సంతోషం కోసం ప్రతిక్షణం పనిచేస్తామని తెలుపుతూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

నిధుల విడుదల ఇలా..

ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు రూ.519 కోట్లు, టీడీఎస్ పెండింగ్ బిల్లులు రూ.265 కోట్లు, సీపీఎస్ బకాయిలు రూ.300 కోట్లు, పోలీస్ సరెండర్ లీవ్స్ బకాయిలు రూ.214 కోట్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.788 కోట్లు, ఎన్టీఆర్ వైద్యసేవకు రూ.500 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 500కోట్లు, అమరావతి కౌలు రైతులకు రూ.241 కోట్లు, చిన్న కాంట్రాక్టర్లకు రూ.586 కోట్లు, 6 వేల మంది చిన్న వ్యాపారులకు రూ.100 కోట్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement