Wednesday, December 4, 2024

AP | ఈ నెల‌ రెండో వారంలో పోలవరానికి సీఎం చంద్రబాబు

రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు యజ్ఞంలా 2027నాటికి నిర్మాణం పూర్తి చేసే నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ నెల‌ రెండో వారంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించ‌న‌నున్నారు. అదేరోజు పోలవరం నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత 10 రోజుల్లో మరింత క్లారిటీ తీసుకుని షెడ్యూల్‌ తయారు చేస్తామన్నారు. మంగళవారం రాత్రి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పోలవరం, ఇతర ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, వాటర్‌ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష చేపట్టారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను యుద్ధప్రాతిపదికన చేపట్టి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికి తాగునీరు అందించేందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి అవగాహనతో షెడ్యూల్ విడుదల చేసే స్థాయికి చేరుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు.

2026 జూన్‌ కల్లా వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఒక్కొక్క సాంకేతిక సమస్యలను అధిగమిస్తామని, ఇప్పటికే ప్రాజెక్టుల డిజైన్లకు సూత్రప్రాయంగా అనుమతులు లభించాయన్నారు. పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌, భూసేకరణకు సంబంధించిన రూ.996 కోట్ల పెండింగ్‌ నిధులను విడుదల చేసేందుకు సీఎం ఆదేశాలు జారీ చేశారని మంత్రి నిమ్మల తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement