ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ముంబైకి వెళ్లనున్నారు. మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు సాయంత్రం 5గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హజరయ్యేందుకు చంద్రబాబు ముంబైకి వెళుతున్నారు.
ముంబయిలోని అజాద్ గ్రౌండ్‌లో మహా ముఖ్యమంత్రిగా మూడోసారి ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ నేతలు హజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి హజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ముంబయి చేరుకోనున్నారు.