Wednesday, December 18, 2024

AP | పోలవరంలో సీఎం చంద్రబాబు.. పనులపై సమీక్ష

పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శిస్తున్నారు. విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. అనంతరం స్థానిక అతిథిగృహంలో ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్షిస్తారు.

సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా చేపట్టే పనుల షెడ్యూల్ ను సీఎం వెల్లడించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement