ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఈ నెల 23న బీజేపీ కూటమి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు భేటీ కానున్నారు.
ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై అమిత్ షాతో చంద్రబాబు చర్చించనున్నారు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను చంద్రబాబు ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు.
- Advertisement -