- సత్యసాయి జిల్లా కలెక్టర్‌కు ఫోన్…
- భాద్యులపై చర్యలకు ఆదేశం
సత్యసాయి జిల్లాలోని సీకే పల్లి వసతి గృహంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందని విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సత్యసాయి జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు… నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వసతిగృహంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండని వార్డెన్, సంబంధిత ఉద్యోగుల తీరుపై మండిపడ్డారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థులకు భోజనం సమకూర్చినట్లు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా చంద్రబాబుకు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీకేపల్లి బీసీ వసతి గృహం వార్డెన్ ను కలెక్టర్ విధుల నుంచి తొలగించారు.