Sunday, June 30, 2024

AP: కుప్పంలో సీఎం చంద్రబాబు.. అడుగడుగునా ప్రజల నీరాజనాలు

కుప్పం, జూన్ 25(ప్రభ న్యూస్) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండ్రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం మధ్యాహ్నం 12.59 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ పిఈఎస్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్ కు చేరుకున్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ పి.శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా శాసనసభ్యులు ఘన స్వాగతం పలికారు.

పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును చూసేందుకు, పలకరించేందుకు వచ్చిన అశేష జనవాహినికి ఆయన అభివాదం చేస్తూ.. పలకరిస్తూ.. వారికి నమస్కరిస్తూ ముందుకు సాగారు. అనంతరం పిఈఎస్ మెడికల్ కళాశాల నుండి ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన మధ్యాహ్నం 1.18 గం.లకు శాంతిపురం మండలం జల్లిగానిపల్లిలో హంద్రీనీవా కాలువను పరిశీలించేందుకు వెళ్లారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement