అమరావతి, ఆంధ్రప్రభ : మహాయుటి కూటమి సాధించిన ఈ విజయం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. శనివారం కూటమికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలను తెలియజేశారు. మహారాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా తిరుగులేని విజయాన్ని ఎన్డీఏ మహాయుటి దక్కించుకుందని అభినందించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు బలంగా కోరుకుంటోన్నారనే విషయం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మరోసారి రుజువైందని సీఎం చంద్రబాబు అన్నారు. మోడీ వ్యూహాత్మక విజన్, ప్రజలు దేశాభివృద్ధి పట్ల అకుంఠిత చిత్తశుద్ధితో వికసిత్ భారత్ కు దోహదపడుతుందని అన్నారు.
అలాగే మహారాష్ట్ర ఎన్నికలలో మహాయుతి కూటమి విజయంలో కీలకపాత్ర పోషించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు.అలాగే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్కు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు అపూర్వ విజయం సాధించారని అభినందించారు.