ఆధ్యాత్మిక, పర్యాటక ప్రమోషన్స్ కోసం దేవాదాయ, పర్యాటకశాఖ, అటవీ శాఖ మంత్రులతో ప్రత్యేక కమిటీ వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఆంధ్ర ప్రదేశ్ దేవాలయంలో అపచారానికి చోటు ఉండకూడదని, ఆధ్యాత్మిక వెల్లివిరసాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.దేవాలయం ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో ఇద్దరికి అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
భక్తుల మనోభావాలకు, అగమ శాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రధానం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవాలయాల్లోని అర్చకులకు ఇకపై రూ.15 వేల రూపాయలు ఇవ్వాలని, ధూప దీప నైవేద్యాలకు ఇస్తున్న రూ. 5 వేల ను రూ. 10 వేలకు ల పెంచాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ 3,000 రూపాయలు భృతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం రూ 25,000 ఉండేలా చర్యలు తీసుకోవాలి సీఎం చంద్రబాబు అన్నారు. సీజీఎఫ్ కింద శ్రీవాణి ట్రస్టు నిధులతో జరిగే పనుల్లో ఇంకా ప్రారంభం కానీ పనులు వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రసాదంలో నాణ్యత ఉండాలని, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు సబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సింహాచలం పంచగ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులకు ఇకముందు రూ 15, 000 ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడంతో అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.