అమరావతి – ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభించనున్న చంద్రబాబు రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతం, అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్ , ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయాలు, మంత్రులు, జడ్జిల గృహసముదాయాలు , ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లును ఆయన సందర్భించనున్నారు.
అలాగే రాజధాని ప్రాంతంలో నిర్మాణాల స్థితిగతులు పరిశీలించనున్నారు.. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోడ్ల పక్కనున్న ముళ్ల కంచెలు, తుమ్మ చెట్లని సీఆర్డీఏ అధికారులు తొలగిస్తున్నారు. ఈ పర్యటనలోనే త్వరగా అమరావతి రాజధాని శాశ్వత నిర్మాణాలు పూర్తి చేయాలని సీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.