Sunday, November 10, 2024

అప్పు తలపై ముద్దాడి అంతిమ నివాళులర్పించిన సీఎం బొమ్మై..

పునీత్ రాజ్ కుమార్ ను అందరూ ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు. సినీ రంగంతో పాటు అప్పు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వమిస్తున్నారు. తమ అభిమాన నటుడు లేడని తెలుసుకున్న అనేకమంది కలత చెందారు. ఆయన మరణం తట్టుకోలేక కొందరు గుండెపోటుకు గురయ్యారు. కన్నడిగుల మనసుల్లో అప్పు ఓ ధ్రువతారగా మిగిలిపోయారు. కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం చిత్రపరిశ్రమలో విషాదాన్ని నింపింది. పునీత్ రాజ్‌కుమార్ మరణంపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఆయన లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అని కర్నాటక సీఎం బస్వరాజు బొమ్మై అన్నారు.

పునీత్ పార్థివ దేహానికి తుది నివాళి అర్పించేందుకు పోటెత్తిన జనంతో కంఠీరవ స్టేడియం కన్నీటి సంద్రమైంది. చిత్ర పరిశ్రమలో పెద్దా, చిన్నా తేడా లేకుండా కంఠీరవ స్టేడియానికి వచ్చి పునీత్‌కు నివాళి అర్పించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు లక్షలాది మంది తమ అభిమాన నటునికి కడసారి చూపునకు తరలివచ్చారు.

క‌ర్నాట‌క సీఎం బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, ఎస్‌.ఎం.కృష్ణ, సదానందగౌడ, గవర్నరు థావర్‌ చంద్‌ గహ్లోత్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తదితరులు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. పునీత్ మరణంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పునీత్‌‌ చివరిసారిగా తనతో మాట్లాడిన మాటలను శనివారం ఆయన గుర్తుచేసుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్‌ చనిపోవడానికి ముందు రోజు (గురువారం) కర్ణాటక టూరిజానికి సంబంధించిన ఓ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించాలని తనను కోరారన్నారు.

నవంబర్‌ 1న దానికి సంబంధించిన యాప్‌ని విడుదల చేయబోతున్నాననీ చెప్పారు.. కానీ, ఆయన మన మధ్య లేకపోవడం దిగ్భ్రాంతిగా ఉందని సీఎం బొమ్మై ఆవేదన వ్యక్తంచేశారు. కర్ణాటక రాష్ట్రం, కన్నడ చిత్రసీమ, యువత ఆయన్ను ఎంతగానో మిస్ అవుతున్నారని సీఎం పేర్కొన్నారు.

ఆదివారం తెల్లవారుజామున కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకు అంతిమ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో వేలాదిగా అభిమానులు పాల్గొన్నారు. అనంతరం తల్లిదండ్రులు రాజ్‌కుమార్, పార్వతమ్మల సమాధి పక్కనే పునీత్‌ అంత్యక్రియలు జరిగాయి. అప్పు సోదరుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ కుమారుడు వినయ్‌ అంతిమ సంస్కరాలను నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement