Friday, November 22, 2024

Closed – ఆంధ్ర పేప‌ర్ మిల్లు లాకౌట్ .. కార్మికుల‌కు రాత్రికి రాత్రే షాక్


త‌మ కొర్కెల సాధ‌న‌కు 23 రోజులుగా స‌మ్మె
చ‌ర్చ‌ల‌కు పిలువ‌ని యాజ‌మాన్యం
ఆక‌స్మికంగా లాఔట్ ప్ర‌క‌ట‌న‌
కార్మిక‌లు ఆగ్ర‌హం.. రాజ‌మండ్రిలో టెన్ష‌న్

రాజమండ్రిలో ఉన్న ఆంధ్ర ప్రేపర్ మిల్ నేడు లాకౌట్ ప్రకటించింది. మిల్ గేట్లకు యాజమాన్యం తాళం వేసింది. మరోవైపు, ఉన్నట్టుండి లాకౌట్ ప్రకటించడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేటు వద్ద వారు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

- Advertisement -

ఇది ఇలా ఉంటే త‌మ కొర్కెల సాధ‌న క‌సం ఈ నెల 2వ తేదీ నుంచి పేపర్ మిల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. గత 23 రోజులుగా వారు సమ్మెలో ఉన్నారు. కొత్త వేతన ఒప్పందం కోసం సమ్మెకు దిగారు. ఆంధ్ర పేపర్ మిల్ ఏడాదికి రూ. 200 కోట్ల నికరలాభంలో ఉందని అయినప్పటికీ మిల్ లో పని చేస్తున్న 2,500 మంది కార్మికుల వేతన ఒప్పందాల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందంటూ కార్మికులు ఆరోపించారు..

స‌మ్మె ప‌రిష్కారం కోసం చ‌ర్చ‌లకు పిలుపు వ‌స్తుంద‌నే ఆశ‌తో ఉన్న కార్మికుల‌కు నేటి ఉద‌యం ఊహించని విధంగా మిల్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మిల్ మెయిన్ గేటు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement