Tuesday, November 19, 2024

Michang: ఏపీ వ్యాప్తంగా పాఠ‌శాల‌ల‌కు బంద్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. తుఫాన్ తో ఎపిలో భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉంది. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నెల్లూరు నుంచి కాకినాడ వరకు కోస్తా జిల్లాలో తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని స్కూళ్లకు సెలవులు ప్రకటించామని ఎపి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ జిల్లాల్లో తీవ్రత బట్టి కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సోమవారం, మంగళవారం పాఠశాలలకు సెలవు ఉంటుందని తెలిపింది. ఎపిలో మరో మూడు రోజుల భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement