( ప్రభన్యూస్, ఒంగోలు బ్యూరో ) – ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఎవ్వరొచ్చినా అభ్యంతరం లేదని, తన పని తాను చేసుకుంటానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒంగోలులో 25 వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేయాలనేది తన ఆశని, ఎంపీ అభ్యర్థి విషయంలో అన్నీ నియోజకవర్గాల అభ్యర్దులకు మేలు జరుగుతుందని మాగుంట కోసం ప్రయత్నం చేశానని అన్నారు. . కానీ మిగతా నియోజకవర్గాల ఇంచార్జీలు, ఎమ్మెల్యేలు పట్టీ పట్టనట్లున్నారని వివరించారు. అధిష్టానం దృష్టిలో తాను ఒక్కడినే ప్రశ్నించినట్లవుతోందని అంటూ..అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. తాను అందరి శ్రేయస్సు కోసం అడుగుతున్నానని, .. మిగతావాళ్ళకు పట్టనప్పుడు తనకు మాత్రం ఎందుకు? అని బాలినేని ప్రశ్నించారు.
ఒంగోలు నియోజకవర్గ పేదల పట్టాల కోసం ప్రయత్నం చేసుకున్నా.. సీటు విషయంలో వాళ్ళు పట్టించుకొనప్పుడు తనకు మాత్రం ఎందుకు అని పేర్కొన్నారు. తాను సీఎం పిలిస్తే వెళ్లనన్నానని చెప్పటం నిజం కాదని, అలాగే పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు.. తాను ఏ ఏ మీడియాతో మాట్లాడలేదని, ..ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఊహించుకుని రాసుకుంటున్నారని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒంగోలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం పనిచేస్తానని, .. ఏ ఎంపీ అభ్యర్ధి వచ్చినా తనకు ఏ అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు..