Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ Civils Main Results – సివిల్ సర్వీసు మెయిన్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల

Civils Main Results – సివిల్ సర్వీసు మెయిన్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల

0
Civils Main Results – సివిల్ సర్వీసు మెయిన్ ఎగ్జామ్స్  ఫలితాలు విడుదల

న్యూ ఢిల్లీ : అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్‌) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్‌ 20 నుంచి 29 వరకు మెయిన్‌ పరీక్షలు జరగ్గా.. ఈ ఫలితాలను సోమవారం సాయంత్రం విడుదల చేసింది.

పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ)కు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్లతో జాబితాను విడుదల చేసింది.

ఈ ఏడాది మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి జులై 1న ఫలితాలు వెల్లడించారు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మెయిన్‌ పరీక్షలు నిర్వహించిన అధికారులు..

తాజాగా ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. త్వరలో నిర్వహించే ఇంటర్వ్యూలో సత్తా చాటిన వారిని ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేంద్ర (గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బి) సర్వీసులకు ఎంపిక చేస్తారు.

Exit mobile version