సివిల్ తో పాటు ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు నేటి యువత తరలి వెళ్లింది. అయితే, పేద విద్యార్థులు అంతదూరం వెళ్లలేక తమకు తోచిన పుస్తకాలు చదివి పోటీ పరీక్షలకు హాజరవుతున్నారు. యువత ఆలోచనకు పదును పెడుతూ.. అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలో ప్రత్యేక లైబ్రరీ ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షలకు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయంపై నిష్ణాతులైన వారితో శిక్షణ ఇస్తున్నారు. ఆదివారం పోలీసు డిజిటల్ లైబ్రరీ కమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్డడీ సెంటర్ ను ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులు డాక్టర్ సుధాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లితో కలిసి సందర్శించారు.
సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న పిల్లల (ఆస్పిరెంట్స్ )తో తన అనుభవాలు పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో కీలక భూమిక పోషించే ఏపీపీఎస్సీ విధి విధానాలు, పరిజ్ఞానం మరియు తన అనుభవాలు తెలియజేశారు. సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు ప్రిపరేషన్ ,లక్ష్యసాధన , తదితర అంశాల గురించి విద్యార్థులకు దిశానిర్ధేశం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital