Wednesday, January 22, 2025

AP | సీఐలకు త్వ‌ర‌లో డీఎస్పీలుగా పదోన్నతులు.. డీజీపీ

కర్నూలు బ్యూరో, జనవరి 22 (ఆంధ్రప్రభ) : సీఐలకు డీఎస్పీలుగా త్వరలో పదోన్నతులు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమల రావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంతి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ ఉండాలని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికట్టాలని కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగానికి సూచించడం జరిగిందని తెలిపారు. బుధవారం ఉదయం డీజీపీ ద్వారక తిరుమలరావు కర్నూలు జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని కేఎస్.వ్యాస్ ఆడిటోరియం దగ్గర పోలీసుల నుండి గౌరవందనం స్వీకరించారు.

అనంతరం వ్యాస్ ఆడిటోరియం ఎదుట మొక్కలను నాటారు. అనంతరం పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సైబర్ నేరాలను కట్టడి చేయాలన్నారు. చిన్న పిల్లలు, మహిళలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టాలన్నారు. పోలీసు బృందాలు ఏర్పాటు చేసి నేరాలను చేధించాలని అధికార సిబ్బందికి సూచించారు. నేరాల అదుపు క్రమంలో విస్తృతంగా సాంకేతిక టెక్నాలజీని వినియోగించాలన్నారు.

అనంతరం డీజీపీని కర్నూలు రేంజ్ డీఐజీ, కర్నూలు జిల్లా ఎస్పీ శాలువాతో సన్మానించి, నటరాజ విగ్రహ జ్ఞాపికను అందజేశారు.అనంతరం డీజీపీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏఎస్పీ ట్రైనీగా కర్నూలు జిల్లాలో పని చేశానన్నారు. ఏఎస్పీ ట్రైనీగా పని చేసిన విషయాలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం జరిగిందన్నారు. నేరాలు అరికట్టడం , శాంతిభద్రతల పరిరక్షణ విషయాల గురించి జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష చేయడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లా పోలీసుల పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు.

- Advertisement -

కర్నూలు ఎస్పీ గా పనిచేస్తున్న జి.బిందు మాధవ్ ఐపియస్ కాకినాడకు బదిలీకావడం జరిగిందన్నారు. ఆయనతో కూడా మాట్లడ‌డం జరిగిందన్నారు. కొత్తగా జరుగుతున్న నేరాల పట్ల, క్రైమ్ రివ్యూ విషయంలో టెక్నాలజీ వాడుకోవాలనే విషయాలను కేసులు త్వరితగతిన పురోగతి సాధించాలని జిల్లా పోలీసు అధికారులకు తెలిపారు. మ్యాన్ ఫవర్ తగ్గించి, సాంకేతికత పరిజ్ఞానం వినియోగిస్తూ కేసులు చేధించాలన్నారు. ప్రజలకు మేరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే పోలీసు యంత్రాంగం పని చేయాలని సూచించడం జరిగిందన్నారు.


ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్, కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ , హోంగార్డు కమాండెంట్ సదరన్ రీజియన్ ఎం. మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, డిఎస్పీలు బాబు ప్రసాద్, వెంకట్రామయ్య, ఉపేంద్రబాబు, హేమలత, భాస్కర్ రావు, ట్రైనీ డిఎస్పీ ఉష శ్రీ, సిఐలు, ఆర్ ఐలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement