ప్రకాశం జిల్లా అద్ధంకిలో గ్యాంగ్ వార్ స్టార్ట్ అయ్యింది. టౌన్‌లోని రెండు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు సై అంటే సై అంటూ తొడగొడుతున్నారు. పట్టపగలే సినిమా ఫైటింగ్‌ను తలపించేలా కొట్లాటకు దిగారు. వెంట పడుతూ.. పరుగులు తీస్తూ కొట్టుకున్నారు.
అద్దంకి (ప్రభ న్యూస్): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో సై సినిమాను తలపించేలా కాలేజీ స్టూడెంట్స్ వార్ నడుస్తోంది. మా కాలేజీ గ్రేట్ అంటే.. లేదు లేదు తమ కాలేజీనే గ్రేట్ అంటూ ఇరు వర్గాలు తలపడుతున్న తీరు అచ్చం సై మూవీని గుర్తుకు తెస్తోంది. అద్దంకిలోని రెండు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల ఆధిపత్య పోరులో విద్యార్థులు నలిగిపోతున్నారు. గ్రూప్ లుగా ఏర్పడి ఒకరికొకరి విమర్శలు చేసుకుంటూ గొడవలు పడుతున్నారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థి తనను గాయపర్చిన మరొక కళాశాలలో చదువుతున్న విద్యార్దులపై రివేంజి తీర్చుకొనేందుకు ప్రణాళికలు రచించుకొని ఆ కళాశాల విద్యార్థులు రెచ్చగొడుతున్నారు. గ్రూప్‌లు ఏర్పడి బాహా బాహికి దిగారు.
అద్దంకి టౌన్ విద్యానగర్‌లోని కళాశాలల ప్రాంతంలో ఈ ఘటన నిన్న మరోసారి జరిగింది. రివేంజి కోసం.. రాయల్ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, విశ్వభారతి జూనియర్ కళాశాల విద్యార్థిని సినీ పక్కిలో లాక్కొచ్చి చితక బాదారు. పట్టణంలోని రాయల్ జూనియర్ కళాశాల, విశ్వభారతి జూనియర్ కళాశాల యాజమాన్యాలకు కొంత కాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆధిపత్య పోరు పెరిగింది. దీనిలో భాగంగా రాయల్ కళాశాల విద్యార్థి పై విశ్వభారతి కళాశాల విద్యార్థులు దాడులు చేశారు. ఆ ఘటనలో గాయపడిన విద్యార్థి రివేంజి ఆలోచన చేశాడు. తోటి స్నేహితులను, పట్టణంలో డిగ్రీ కళాశాలలోని తన ఫ్రెండ్స్‌తో కలిసి సోమవారం దాడి చేసి గాయ పరిచాడు. అయితే సోమవారం విద్యార్దుల మధ్య జరిగిన గొడవల్లో ఆయా కళాశాలల యాజమాన్యంతో పాటు, యాజమాన్య బంధువులు కూడా ఉన్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..