Thursday, November 21, 2024

సినిమా వినోదమే కాదు..మంచి సందేశం ఇవ్వాలన్న‌ మంత్రి పేర్ని నాని

సినిమా అనేది మన సమాజంలో ఇప్పటికీ చాలా శక్తివంతమైన మాధ్యమం అని అది కేవలం వినోదంగానే ఉండకూడదని, ప్రేక్షకులకు ఉపయోగపడే మంచి సందేశం సైతం అందులో మిళితమై ఉంటే బాగుంటుందని తాను వ్యక్తిగతంగా కోరుకొంటానని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన నేరుగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే తక్షణ పరిష్కారం చూపించారు.

తొలుత హైదరాబాద్ నుంచి దర్జా సినిమా నిర్మాత పైడిపాటి శివశంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పైడిపాటి రవి ,డైరక్టర్ సలీం మాలిక్ ( మాక్ ) బృందం మంత్రి పేర్ని నానిను కలిశారు. తమ చిత్ర యూనిట్ చిలకపూడి పాండురంగ స్వామి ఆలయం, బందరుకోట పోర్టు, మంగినపూడి బీచ్ ,గిలకలదిండి ఫిషింగ్ హార్బర్, కోనేరు సెంటర్ , గూడూరు, గుడివాడ సమీపంలోని వేల్పూరు సిద్ధాంతంలోని గుడి తదితర లొకేషన్లలో 20 రోజుల పాటు సునీల్, అనసూయ హీరో హీరోయిన్లగా నటిస్తున్న ‘ దర్జా ‘ సినిమా షూటింగ్ ఈ నెల 25 వ తేదీన మచిలీపట్నంలోప్రారంభించనున్నట్లు అందుకు తమ అనుమతి తొలి చిత్రీకరణ షాట్ కు క్లాప్ కొట్టి లాంఛనంగా ప్రారంభించాలని చిత్ర యూనిట్ మంత్రిని కోరారు.

సినిమా షూటింగ్ కు సంబంధించిన పోలీస్ అనుమతులు తదితర విషయాలు తన వ్యక్తిగత కార్యదర్శి రఘురామ్ పరిశీలిస్తారని, ఆయనను కలవాలని సూచంచారు. తనకు 25 వ తేదీ శాసనసభ ఉందని ఆ తర్వాత పలు కార్యక్రమాలు ఉన్నందున తన ప్రమేయం లేకుండా సినిమా షూటింగ్ ప్రారంభించుకోవాలని తానూ తప్పక ఈ 20 రోజులలో షూటింగ్ స్పాట్ కు వస్తానని వారికి తెలిపారు. అలాగే మచిలీపట్నానికి చెందిన దావళం మణి అనే మహిళ మంత్రిని కలిసి తన కష్టాన్ని చెప్పుకొంది. తాను ఉయ్యూరు సాంఘీక సంక్షేక శాఖ వసతి గృఘంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నానని వృద్ధాప్యంకు తోడు ఆరోగ్యం సరిగా లేని తనను అక్కడ వార్డెన్ తనను వంట చేయమని అంటున్నారని తెలిపింది. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని సంబంధిత అధికారితో మాట్లాడి తాను ఆమె పరిస్థితి ప్రత్యక్షంగా చూశానని ఆ తరహా విధులు నిర్వర్తించలేదని ఆమె ఆరోగ్య తీరును బట్టి ఆమె స్వస్థలం మచిలీపట్నంకు బదిలీ చేయాలనీ ఆదేశించారు. అలాగే ఉపాధ్యాయుడు అబ్దుల్ అజీజ్, కాటూరు ప్రాంతానికి చెందిన ఒక మ‌హిళ‌, మ‌చిలీప‌ట్నం రాజుపేట‌కు చెందిన డి.భాను అనే యువ‌తి వారి స‌మ‌స్య‌లు మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement