ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో మొదలు
హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సిఐడి సోదాలు
జగన్ ప్రభుత్వంలో ఆ పదవిలో ఉన్న వాసుదేవరెడ్డి
మద్యం పంపిణీలో అవతవకలంటూ పలు పిర్యాదులు
ఎపి నుంచి వచ్చిన సిఐడి బృందం
గత సర్కార్ లో ఆరోఫలు ఎదుర్కొంటున్న అధికారులపై వేట ప్రారంభమైంది.. దీనిలో భాగంగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. ఎపి నుంచి వచ్చిన సిఐడి అధికారుల ప్రత్యేక బృందం హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉదయం నుంచి వివిధ పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై కూడా సోదాలు చేపట్టారు.
కాగా జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవరెడ్డి ముందుండి నడిపించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో కరడుగట్టిన మద్దతుదారుగా పనిచేశారు. నూతన మద్యం విధానం పేరుతో ఆ పార్టీకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్ తీసుకురావడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. దీనిపై ఫిర్యాదుల నేపథ్యంలోనే సీఐడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.