Friday, November 22, 2024

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ… ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్‌..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫేక్ ప్రచారంపై సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ ఫిర్యాదు చేయడంతో ఈసీ ఆదేశాల మేరకు సీఐడీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఏ1 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏ2 నారా లోకేశ్ లపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఫేక్‌ ప్రచారం చేసినందుకు గాను వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో ఏపీ సీఐడీ చంద్రబాబు, లోకేశ్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబును ఏ1గా, లోకేశ్‌ను ఏ2గా చేర్చింది సీఐడీ. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో దుమారం చెలరేగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement