Tuesday, November 19, 2024

AP | నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీలో సీఐడీ తనిఖీలు…

రిజిస్టర్లు రికార్డులు పరిశీలన…
నంద్యాల బ్యూరో, అక్టోబర్ 22 ఆంధ్ర ప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆగ్రో ఇండస్ట్రీలో ఏపీ సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రమైన నంద్యాలలో ఉన్నటువంటి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీలో భారీగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఈ కంపెనీపై గతంలో పలు అక్రమ ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో సీఐడి అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. బాటిలింగ్ యూనిట్లు పలు మద్యం బాటిళ్ల‌ శాంపుల్ నమూనాలు కూడా సేకరించారు. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ ఫ్యాక్టరీలో మద్యం తయారైనట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ కంపెనీలో వైసీపీ పెద్దలకు కూడా భాగ‌స్వామ్య‌ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెలిబుచ్చుతున్నారు.

దాదాపుగా 30 మంది సిఐడి అధికారులు ఈ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీలో అడుగడుగునా ఉన్నటువంటి ఫ్యాక్టరీ నిబంధనలను రికార్డులను పరిశీలించారు. ఇందులో మద్యం తయారీ అంశాలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని అధికారులు తెలుపుతున్నారు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి సంబంధించినది. 2014 సంవత్సరంలో ఎంపీకి గెలిచిన మరుక్షణం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

- Advertisement -

2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఎస్పీవై రెడ్డి అకాల మరణం చెందారు. 2019 వ సంవత్సరంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగ్రో ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీని పలు విధాలుగా రాజకీయ కారణాలతో వైసీపీ నాయకుల పెద్దల భాగస్వామ్యంతో ఈ ఫ్యాక్టరీని నడుపుతూ వచ్చారని ఆరోపణలు వినిపించాయి. చివరికి మంగళవారం ఏపీ సిఐడి ఆకస్మిక తనిఖీల్లో ఏం బయటపడుతుందో. ? అధికారులకు ఎలాంటి నివేదిక సమర్పిస్తారో వేచి చూడాల్సిందే… ?

Advertisement

తాజా వార్తలు

Advertisement