ఎపిలో ఏకకాలంలో పటు చోట్ల సోదాలు
లెక్కల చూపకుండా అధికమద్యం తయారీ
బాటిలింగ్ యూనిట్లలో సైతం దాడులు
అధిక మద్యం తయారీపై ఆరా
అమరావతి – లెక్కలలోకి రాకుండా అధిక మద్యం ఉత్పత్తి చేస్తున్నాయంటూ పలు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎపిలోని డిస్టిలరీలపై సిఐడి దృష్టి పెట్టింది.. దీంతో ఎపిలోని లు జిల్లాలలో మద్యం ఉత్పత్తి చేస్తున్నడిస్టీలరీపై నేడు మెరుపు దాడి చేసింది.. ఏకకాలంలో 19 ప్రాంతాలలో సోదాలు చేపట్టింది.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలో ఉన్న ఎస్వీఆర్ డిస్టిలరీస్‌పై దాడులు నిర్వహించారు.
అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలోని విశాఖ, జీఎస్పీ డిస్టిలరీస్‌లో తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లా సింగారయకొండ మండలం పాత సింగరాయకొండ పరిధిలోని పెరల్ డిస్టిలరీని అధికారులు తనిఖీలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి సెంటనీ బయోటెక్ కర్మాగారంలో మద్యం బాటిలింగ్ యూనిట్లో సీఐడీ అధికారుల సోదాలు నిర్వహించారు.
మరోవైపు నంద్యాలలో ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్‌ను సీఐడీ అధికారులు పరిశీలించారు. సంస్థపై పలు ఆరోపణలు రావడంతో సీఐడీ అదనపు ఎస్పీ హుస్సేన్ పీర ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. సుమారు 30 మంది అధికారులు పాల్గొన్నారు. విశాఖ , శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలోనూ సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి