ఏపీ ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో సీఐడీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది సీఐడీ. ఈ చార్జ్‌షీట్‌లో ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా వేమూరి హరికృష్ణ, ఏ-3గా కోగంటి సాంబశివరావులను పేర్కొంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దోపిడీ పర్వంలో ఫైబర్‌నెట్ కుంభకోణం ఒకటి. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో పచ్చ ముఠా అడ్డగోలు అవినీతికి పాల్పడింది. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలను సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బట్టబయలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన “టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని నిగ్గు తేల్చింది. ఈ మేరకు సీఐడీ.. ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.