Tuesday, November 26, 2024

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై సీఐడీ కేసు

తన సర్వీసు రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. బీకాం పూర్తయినట్లు తప్పుడు సర్టిఫికెట్ పెట్టి ప్రయోజనాలు పొందారని అశోక్ బాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. అశోక్ బాబు ఎపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. గతంలో ఏసీటీవోగా పని చేసిన సమయంలో అశోక్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. తన సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదు చేశారు. డిగ్రీ బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే అభియోగాలపై కేసు నమోదు చేశారు.


తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్‌ చేయడమే కాకుండా, ఎన్నికల అఫిడవిట్‌లో కూడా డిగ్రీ చదివినట్లు పేర్కొన్నారనే అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. అశోక్ బాబుపై ఐపీసీ 477A, 465,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2021లో అశోక్‌బాబుపై లోకాయుక్తాలో కేసు నమోదు కాగా, ఆ కేసును సీఐడీకి అప్పగించాలని లోకాయుక్తా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అశోక్‌బాబుపై కేసు నమోదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement