Wednesday, December 25, 2024

AP | క్రీస్తు జన్మదినం.. ప్రపంచానికి పండుగ దినం : సీఎం చంద్రబాబు

క్రిస్మస్‌ సందర్భంగా క్రిస్టియన్‌ సోదరులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త యేసు క్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినం అని అన్నారు. ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలను అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందామని అన్నారు. సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దామని సీఎం చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.

- Advertisement -

క్రిస్మస్‌ శుభాకాంక్షలు : డిప్యూటీ సీఎం పవన్‌

క్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సద్భావన, శాంతి, క్షమ అనేవి ఏసు క్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలు అని పేర్కొన్నారు. క్రీస్తుపై నమ్మకం ఉన్న విశ్వాసులందరూ ఈ సుగుణాలను ఆచరించి శాంతి, దాన ధర్మాలకు ఆలంబనగా నిలవాలవాలని సూచించారు. విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పాదుగొల్పాలి. ఈ క్రిస్మస్‌ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement