Wednesday, January 15, 2025

Chittoore – పండుగ వేళ విషాదం …. ఇద్దరు బాలురు మరణం

చిత్తూరు – సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బాలురు మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళితే.. చంద్రగిరి పట్టణం బీడీ కాలనీకి చెందిన సమీర్ అనే బాలుడు మరో స్నేహితుడితో కలిసి గాలిపటం (పతంగి) ఎగురవేస్తుండగా, ప్రమాదవశాత్తు బాలుడు కిందపడటంతో గాయపడ్డాడు. దీంతో గాయపడిన ఆ బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో గాయపడిన బాలుడి పక్కనే ఉన్న సమీర్‌ను మేనమామ కోపంతో గదిలో పెట్టి గొళ్లెం వేశాడు. మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత కొడతాడన్న భయంతో సమీర్ (12) గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

- Advertisement -

మరోపక్క మదనపల్లె గ్రామంలో ఓ బాలుడు గాలిపటం ఎగురవేస్తున్న క్రమంలో కరెంటు షాక్ కొట్టడంతో మృతి చెందాడు. ఈ ఘటనలతో పండుగ పూట ఆ బాలుర కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement