Tuesday, November 26, 2024

రైతు భరోసా పథకం.. రైతుల ఖాతాలో నగదు

వైయస్‌ఆర్‌ రైతు భరోసా పీఎం కిసాన్, వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, వైయస్‌ఆర్‌ యంత్రసేవా పథకాలకు సంబంధించిన నగదును సీఎం జగన్ జమ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు  జిల్లాలో 2021-22 సంవత్సరంలో 2వ విడత రైతు భరోసా కింద 4,20,242 మంది రైతు కుటుంబాలకు రూ.86.69 కోట్లు రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద ఖరీఫ్ 2020వ సంవత్సరంలో ఒక లక్ష రూపాయలలోపు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన 8,365మంది రైతుల ఖాతాల్లో నేరుగా రూ.1.70కోట్లు జమ చేశారు. డా. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద వ్యవసాయ పరికరాలకు 169 కన్సూమర్ హైరింగ్ సెంటర్ (సి హెచ్ సి) గ్రూపులకు గాను రెండవ విడత సబ్సిడీ కింద రూ.2.47 కోట్లు సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం కన్సూమర్ హైరింగ్ సెంటర్ గ్రూపు సభ్యులకు ఖాతాలలో జమ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement