Tuesday, November 26, 2024

చెప్పిందే చేస్తాం – ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో వైవి సుబ్బారెడ్డి…

సత్యవేడు ‌ : అభివృద్ధి, సంక్షేమం జగన్మోహన్‌ రెడ్డికి రెండు కళ్ళు అని టీ-టీ-డీ చైర్మన్‌ వైవీ సుబ్బా రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో సత్యవేడు పట్టణం నేతాజీ రోడ్లో వైయస్సార్‌ రాజశేఖర రెడ్డి విగ్రహం సమీపంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరిగింది . ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి కోడాలి నాని , ఎంపీ మాధవ్‌, తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి , ఎమ్మెల్సీ సునీత, ఎమ్మెల్యే ఉదయభాను , ఎమ్మెల్యే శ్రీనివాస్‌, యస్‌వి నాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్‌ రెడ్డి సీఎం అయ్యాక పేదోళ్ల బ్రతు కులు బాగుపడ్డాయన్నారు. వాళ్లకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని, ఎన్నికలు ముగిసిన వెంటనే సత్యవేడుకు టీ-టీ-డీ ఆధ్వర్యంలో కళ్యాణమండపంతో పాటు- దేవాలయాన్ని నిర్మి స్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగినా తుప్పునాయుడు(చంద్రబాబునాయుడు), పప్పునాయుడు (లోకేసునాయుడు) కు కనిపించవని మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో సర్పంచ్‌లు 75శాతం వరకు వైసీపీ వాళ్లను గెలిపించారని, 99శాతం మునిసిపాలిటీ- ల్లో తమవారే గెలుపొందిన ఉపఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి పోటీ- ఉంచడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే అనుభవం అవసరంలేదని సేవచేసే గుణం ఉంటే చాలని గురుమూర్తిని ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. లోకేష్‌ తిరుపతి సభలో విసిరిన సవాల్‌పై స్పందించిన ఆయన, మాజీ మంత్రి వివేకా హత్యానంతరం 3నెలలు అధికారంలో ఉండి సాక్షాధారాలు లేకుండా చేశారు. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటివి నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల కేంద్ర పరిధిలో ఉన్నా రాష్ట్ర ప్రభు త్వంపై నిందలు మోపడం తగదన్నారు.
చిత్తూరు జిల్లాలో పప్పులుడకవు: పెద్దిరెడ్డి
చిత్తూరు జిల్లాలో నీ పప్పు లుడకవు చంద్రబాబు …… అంటూ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యా నించారు. జిల్లాకు ముఖ్య మంత్రిగా మీరు చేసిందేమీ లేదన్నారు. ఏమైనా ఓట్లు- అడుక్కోవాలంటె కృష్ణా, గుంటూరు లో చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఓటు- వేసేవారే లేరన్నారు . గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు- చేశామన్నారు .గ్రామ వాలంటీ-ర్ల ద్వారా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నట్టు- గుర్తు చేశారు.
పేదవాడికి… ధనవంతుల
మధ్య పోటీ-: నారాయణస్వామి
తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల లో ఒక పేదవాడికి ధనవంతులకు మధ్య పోటీ- జరుగు తోందని ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి అన్నారు. మా పార్టీ అభ్యర్థి పేదవాడు అయినా సేవా చేయడంలో ధనవంతుడు అని అలాంటి వ్యక్తికి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా కార్మిక సంఘం అధ్యక్షుడు బిరేంద్ర వర్మ , రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీ బాలాజీ రెడ్డి , మండల వైసీపీ కన్వీనర్‌ సుశీల్‌ కుమార్‌ రెడ్డి ,నారాయణవనం సింగిల్విం డో అధ్యక్షుడు సుమన్‌ కుమార్‌, సత్యవేడు సింగిల్‌విండో అధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి ,సురుటు-పల్లి ఆలయ చైర్మన్‌ మునిశేఖర్‌ రెడ్డి ,చంద్రశేఖర్‌ రెడ్డి , సర్పంచ్‌ మంజుల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement