పిచ్చాటూరు – తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైకాపా కి భారీ మెజార్టీ ఖాయమని తెలిసే చంద్రబాబు ముందే కారణాలు వెతుక్కుంటున్నారని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎద్దేవా చేశారు. సోమవారం పిచ్చాటూరు రోడ్లు భవనాల అతిథి గృహంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 5 మంది బాధిత కుటుంబ సభ్యులకు 1లక్షల 56 వేలు అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా 45 లక్షల 66 వేల విలువ కలిగిన 80 చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ కి ప్రజలు రాజకీయ సమాధి కడతారనే తిరుపతిలో దొంగ ఓట్లు వేయిస్తోందని వైఎస్సార్సీపీపై అబద్ధపు ప్రచారం నెత్తికెత్తుకున్నారని మండిపడ్డారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి అని అన్నారు. జగన్ పాలనకు సానుకూలంగా ఓటు హక్కును వినియోగించుకున్నమని ,ప్రజలు భావిస్తుంటే, చంద్రబాబు మాత్రం అబద్ధాల ప్రచారంతో తిరుపతిలో తన విశ్వరూపం ప్రదర్శించారని ధ్వజమెత్తారు. మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి అనుసరిస్తున్న విధానాల్నే ఇక్కడా అమలు చేశారన్నారు. పుణ్యక్షేత్రం కావడంతో రోజూ లక్షమంది భక్తులు తిరుపతికి వస్తుండటంతో చంద్రబాబు పక్కా వ్యూహంతోనే తన ఆరోపణలకు పదునుపెట్టారన్నారు. భక్తులను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు అనుకూల మీడియా చేసిన హడావుడి ప్రజాస్వామ్యంలో ఎన్నడూ చూడలేదని అవేదన వ్యక్తం చేశారు. డిపాజిట్లు కూడా రాని పార్టీలు మాత్రమే దొంగ ఓట్లు వేయించాలనుకుంటాయని, అలాంటి పని టీడీపీనో, బీజేపీనో చేసే వీలుంది తప్ప వైఎస్సార్సీపీకి ఏం అవసరమని అదిమూలం ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ కె.టి.హరిచంద్ర రెడ్డి , వైకాపా రాష్ట్ర కార్యదర్శి కె.వి.బాస్కర్ నాయుడు , పిచ్చాటూరు సర్పంచ్ కె.జి.రోస్ రెడ్డి , కె.ఆరుముగం రెడ్డి , రాజనగరం సర్పంచ్ భూపతి , తొప్పయ్య , ప్యాండియన్ , రమేష్ రాజు , గోవిందన్ , ఎస్సై వంశిధర్ , తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement