తిరుపతి సిటీ : వైఎస్ఆర్సిపీ పార్టీకి నిరంతరం శ్వాసగా భావించి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా కలిసి పట్ట భద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఒక యజ్ఞం లాగా నమోదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం డీపీఆర్ కళ్యాణ మండపం నందు వైకాపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 36 నియోజకవర్గాలలో జరగనున్న ఎన్నికల్లో అత్యధికంగా పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని అత్యధికంగా చేర్పించి తిరుపతి నియోజకవర్గం శ్యాం ప్రసాద్ రెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చేలా ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు ఈ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా కమ్యూనిస్టులే పట్ట భద్రులకు సంబంధించి ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడం జరుగుతున్నదన్నారు.
ఎన్నికలు మార్చిలో జరగనున్నాయని తెలియజేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకుంటే పార్టీకి తిరుగు లేదని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్ అని గుర్తు చేశారు. అలాగే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన వికేంద్రీకరణ తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. 36 నియోజకవర్గ పరిధిలో పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగిందని, నీ బిడ్డగా ఆశీర్వదించండి అని అభ్యర్థించారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు పట్టభద్రుల ఓట్లు నమోదు కార్యక్రమం జరుగుతున్నదని ప్రతి ఒక్కరూ ఫామ్18 ద్వారా పూర్తి చేసి డిగ్రీ పూర్తయిన వారి ద్వారా ఓటర్లు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. దరఖాస్తులు ఆధార్ నెంబరు. ఓటు ఐడి నెంబర్ తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తప్పనిసరి అని గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో నగర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన్ అభినయ రెడ్డి,టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం. జయచంద్ర రెడ్డి, మాజీ చైర్మన్ తొండము నాటి వెంకటేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, శేఖర్ రెడ్డి, నరసింహ, పార్టీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, దొడ్డ రెడ్డి మురళి రెడ్డి పాల్గొన్నారు.