తిరుపతి – ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి జరిగిన అన్ని ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న 95 ఏళ్ల వృద్ధురాలికి ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు… తిరుపతి ఉప ఎన్నికలలో తన ఓటును వినియోగించుకునేందుకు కరోనా తీవ్రతను, ఎండ వేడిమిని సైతం పట్టించుకోకుండా కేంద్రానికి చేరుకున్న ఆమెకు తన ఓటు లేదని చెప్పడంతో ఆశ్చర్యపోయింది.. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డ్ తో సహా కదిరివేడ్ కు చెందిన కుప్పమ్మ (95) పోలింగ్ కేంద్రానికి వచ్చింది… ఆమె వద్ద అన్ని అధారాలున్నా ఓటర్ల జాబితాలో ఆమె పేరు లేదని చెప్పడంతో ఒక్కసారిగా పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయింది…ఉన్నన్ని నాళ్ళు ఓటేద్ధమనుకున్నా. కానీ ఎవరికి నామీద కోపమొచ్చిందో ఏమో నేను బ్రతుకుండగానే నా ఓటుహక్కు పీకేశారు. నా ఓటు వేయకుండా వెళ్లను…నా ఓటు ఎందుకు తీసేసారు ఎవరు తీసేసారు.. తెలిసేవరకు కదిలేది లేదు. అంటూ పోలింగ్ కేంద్రం బయట బైఠాయించింది…శతాధిక వయస్సు దగ్గర పడుతున్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఓటు వేయాలనే ఆమె తపన అందర్ని ఆకట్టుకుంది.. ఎన్నికల అధికారులు ఆమె వద్దకు వచ్చి మళ్లీ ఆమె పేరును ఓటర్ల జాబితాలో చేరుస్తామని ఆమెను సముదాయించి ఇంటి పంపారు..
నా ఓటు ఏమైంది… అధికారులను నిలదీసిన 95ఏళ్ల వృద్దురాలు…..
By sree nivas
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement